మూడు రోజుల్లో 16,940 పోస్టులు….

173
- Advertisement -

తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. త్వరలో మరిన్ని పోస్టులు విడుదల చేయనున్నామని తెలిపారు. సీఎస్ సోమేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి సీఎస్‌తో పాటుగా టీఎస్పీఎస్సీ చైర్మన్‌, సీఎస్‌ ఫైనాన్స్‌ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్‌ ఫారెస్ట్‌ శాంతి కుమారి, కార్యదర్శి జీఏడీ శేషాద్రి, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎమ్‌ దోబ్రియాల్‌, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్‌సీడీ కార్యదర్శి రాహుల్‌బోజ్జా, తదితరులు సీనియర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 60,929 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని సీఎస్ తెలిపారు.

టీఎస్పీఎస్సీ లాగే పోలీసు డిపార్ట్‌మెంట్ మెడికల్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ డిఎస్సీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. మ‌రో 16,940 పోస్టుల‌కు మూడు రోజుల్లో అనుమ‌తులు వ‌స్తాయ‌న్నారు. ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ వేగంగా పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. అధికారులు గ‌డువులు నిర్దేశించుకొని ప‌ని చేయాల‌ని సూచించారు.

ఇవి కూడా చదవండి…

భూగర్భ జలవనరుల శాఖలో 57పోస్టులు..

ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ ధనవంతులు….

ఇండియాకు ఫస్ట్‌ ‘గే’ జడ్జ్‌..!

- Advertisement -