ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ ధనవంతులు….

348
- Advertisement -

ఫోర్బ్స్‌ 2022వ సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ ($150) మొదటి స్థానంలో ఉన్నారు. తదుపరిగా ముఖేష్ అంబానీ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. భారతదేశంలోని టాప్ 10 బిలియనీర్ల నికర విలువ USD 385.2 బిలియన్లు. ఇది 2021లో ఉన్న దానికంటే 15.1 శాతం ఎక్కువగా సంపద పెరిగింది.

శివ్‌నాడర్, లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీ గత సంవత్సరం కంటే వెనుకబడిపోయారు. $9.6బిలియన్‌ విరాళంగా ప్రకటించినందువల్ల శివ్‌నాడర్ వెనుకబడిపోయారు. 2013లో మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు అదానీ తన స్థానాన్ని రిప్లేస్ చేశారు.

ఫోర్బ్స్‌ జాబితాలోకి కొత్తగా షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ అధినేత షాపూర్ మిస్త్రీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝునుఝున్‌వాలా టాప్‌ 100లో చేరారు. వీరితో పాటుగా వఖీల్ ఫ్యామిలీ, ఫల్గూనీ నాయర్, రవి మోడీ, సత్యనారయణ నువాల్‌, నిర్మల్ మిండా, రఫీక్‌ మాలీక్‌, మరియు వేణు శ్రీనివాసన్‌ కూడా చేరారు.

అత్యంత పిన్న వయస్సులో టాప్‌ లో ఉన్న భారతీయులు బైజూస్‌ దివ్య గోకుల్‌నాథ్‌, రవీంద్రన్‌ $3.6బిలియన్‌ తో ఉన్నారు. కాగా వీరితో పాటుగా అత్యంత పెద్ద వయస్సులో ఉన్న సిమెంట్ బెను గోపాల్ బంగారు, సోనాలిక గ్రూప్ అధినేత లచ్ఛమన్‌ దాస్ మిట్టల్‌, కుషాల్ పాల్‌ సింగ్ డీఎల్‌ఎఫ్ అధినేతలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి…

జనన ధ్రవీకరణ పత్రం తప్పనిసరి…

ఇండియాకు ఫస్ట్‌ ‘గే’ జడ్జ్‌..!

నవశకానికి నాంది పలికిన రోజు:కేటీఆర్‌

- Advertisement -