తెలంగాణ కరోనా అప్‌డేట్…

22
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 417 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 4982 యాక్టవ్ కేసులుండగా 2,81,872 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1556 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 71,04,367 టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది.