దేశంలో 24 గంటల్లో 18,088 కరోనా కేసులు..

55
coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,74,932కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,27,546 యాక్టివ్ కేసులుండగా 99,97,272 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,50,114 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,31,408 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా . ఇప్పటి వరకు 17,74,63,405 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.