24 గంటల్లో 2734 కరోనా కేసులు…

146
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 28 వేలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 2,734 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృత్యువాతపడ్డారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరాయి. కరోనాతో 836 మంది మృతిచెందగా 95,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,699 యాక్టివ్‌ కేసులున్నాయి.

24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీలో 347 ,రంగారెడ్డిలో 212, నల్గొండ 191, ఖమ్మం 161, భద్రాద్ది కొత్తగూడెం 117, నిజామాబాద్‌ 114, వరంగల్‌ అర్బన్‌ 112, సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్‌లో 106 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.ష్ట్రంలో 0.65శాతం మరణాల రేటు ఉండగా రికవరీ రేటు 74.5శాతంగా ఉంది.