రాష్ట్రంలో 24 గంటల్లో 1896 కరోనా కేసులు…

94
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,896 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,06,644కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,368 యాక్టివ్ కేసులుండగా 1,79,075 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా దేశంలో 1.5 శాతంగా ఉంది. భారత్‌లో కరోనా రికవరీ రేటు 84.2 శాతంగా ఉంటే తెలంగాణలో 86.65 శాతంగా ఉంది.