దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు…

153
ap corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకి 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 68 లక్షల మార్క్‌ను దాటాయి.

గత 24 గంటల్లో 78,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా 971 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరగా కరోనాతో ఇప్పటివరకు 1,05,526 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,02,425 ఉండగా 58,27,705 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 11,94,321 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 8,34,65,975 నమూనాలను పరిశీలించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.