గత కొన్ని రోజులుగా టి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా కమిటీల ఏర్పాటు తరువాత ఈ రగడ పతాక స్థాయికి చేరుకుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ముకుమ్మడి తిరుగుబాటు ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతలకు అసలు విలువ ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వం సరిగా లేదని, అధ్యక్ష పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలంటూ తిరుగుబాటు గళం విప్పారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఫలితంగా టీ కాంగ్రెస్ రెండు వార్తలుగా విడిపోయింది. .
అయితే వివాదం పతాక స్థాయికి చేరుకుంటూ ఉండడంతో సమన్వయ పరిచేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ హైద్రాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో దిగ్విజయ్ గాంధీ భవన్ లో చర్చిస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్ బయట కాంగ్రెస్ ఓయూ విధ్యార్థులు మరియు ఓయూ కాంగ్రెస్ నేతల మద్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రెండు వర్గాల మద్య మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వివాదం చెలరేగింది.
దీంతో టీ కాంగ్రెస్ లో చీలిక ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అటు గాంధీ భవన్ లోపల సీనియర్ల వ్యవహార శైలి.. ఇటు బయట నేతల ఘర్షణ ఇలా గాంధీ భవన్ దగ్గర వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే కాంగ్రెస్ లో నెలకొన్న ఈ అనిశ్చితిని చూసిన దిగ్విజయ్.. ఇలాంటి చూడడానికేనా తాను డిల్లీ నుంచి హైదరబాద్ వచ్చినది.. తన ముందే ఇలా ఘర్షణ పడడం ఏంటని దిగ్విజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాగా మొదట నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ అతర్గత వివాదం.. ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళ్లడంతో టీ కాంగ్రెస్ లో ఈ స్థాయిలో ముసలం ఉందా ! అంటూ అందరూ నోరెళ్ళబెడుతున్నారు. మరి ఈ అంతర్గత యుద్దాన్ని దిగ్విజయ్ ఎంతవరకు చక్కదిద్దుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి…