నానితో సెట్ చేస్తారా ? డౌటే!

65
- Advertisement -

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల – నిర్మాత దిల్ రాజు బంధం ఏనాటిదో. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల రూపంలో వాళ్లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కూడా. మళ్లీ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ కాంబినేషన్ సెట్ అయ్యేలా కనిపిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ లోనే చిరకాలంగా వుండిపోయారు శ్రీకాంత్ అడ్డాల. వెంకటేష్ తో మరో సినిమా అనుకున్నా అది మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు సంస్థలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దిల్ రాజుతో శ్రీకాంత్ అడ్డాల అనుబంధం బాగానే ఉంది, కాకపోతే, ఇన్నాళ్లు వేరే కారణాల వల్ల సినిమా చేయడం కుదరడం లేదు. అయితే, తాజాగా శ్రీకాంత్ అడ్డాల తన క్యాంప్ ను దిల్ రాజు దగ్గరకు మార్చుకున్నాడు. కారణం.. హీరో నాని డేట్ లు దిల్ రాజు దగ్గర వున్నాయి. అవి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఫిక్స్ అయిన ఓ సినిమా కోసం ఇచ్చిన డేట్ లు. సో.. శ్రీకాంత్ అడ్డాల కథ నానికి సెట్ అవుతుంది.

కాబట్టి.. దిల్ రాజు తలుచుకుంటే నాని- శ్రీకాంత్ అడ్డాల సినిమా పాజిబుల్ అవుతుంది. అందుకే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు దిల్ రాజు వైపు చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఉన్న కథ భారీ కథ. బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మరి ఈ కథతో దిల్ రాజు సినిమాని సెట్ చేస్తారా ? డౌటే. కాకపోతే నారప్ప లాంటి మంచి సినిమా లేటెస్ట్ గా శ్రీకాంత్ అడ్డాల లిస్ట్ లో చేరింది. కావున ఏమైనా జరగొచ్చు.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్‌ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చి కృతి

మళ్లీ వినాయక్ స్టార్ట్ చేస్తున్నాడు

2022…హిందీలో మొదటి రోజు కలెక్షన్లు

- Advertisement -