గిరీష్ కర్నాడ్ మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

225
Kcr Giri karnad
- Advertisement -

ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు దర్శకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మ భూషణ్ గిరీష్ కర్నాడ్ మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసేన ఆయన సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుగాంచాయని సిఎం కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

గిరీష్ కర్నాడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1938లో మహారాష్ట్రలోని మథేరన్‌లో జన్మించిన ఆయన కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. రచయితగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ,పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.

- Advertisement -