సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్..

74
kcr

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.