లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్‌..

171
cm kcr
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై మంగళవారం క్యాబినెట్ సమావేశంలో విస్తృత చర్చించనున్నారు. ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని అందరిలో ఉత్కంఠ మొదలైంది.

ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రెండు ప్రతిపాదనలు?

  1. 2 వారాలపాటు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాక్షిక లాక్‌డౌన్ విధించడం!
    – ఈలోగా వరి కొనుగోళ్లు చేపట్టడం!
    – ఆ తరవాత సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం?
  2. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే 2 వారాలపాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం!

తెలంగాణ ప్రభుత్వం తాజా కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 4 వేల 826 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 02 వేల 187లక్షలకు చేరింది. ప్రస్తుతం 62 వేల 797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7 వేల 754 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 32 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 వేల 771కి చేరింది.

- Advertisement -