గెట్ వెల్ సూన్ బ్రదర్‌:ఎన్టీఆర్‌కు మహేశ్‌ ట్వీట్

74
mahesh

ఇప్పటివరకు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారీన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కరోనా నుండి బయటపడ్డ పవన్‌…ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా సోకింది.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించగా సినీ ప్రముఖులు,అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఎన్టీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్ అని ట్వీట్ చేశాడు మహేష్.

ఎన్టీఆర్‌- మ‌హేష్ మంచి స్నేహితులు కాగా, ఆ మ‌ధ్య మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా ఆడియో వేడుక‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విష‌యం తెలిసిందే.