తెలంగాణలో 1096 కరోనా కేసులు: సీఎం కేసీఆర్

228
cm kcr
- Advertisement -

ఇప్పటివరకు తెలంగాణలో 1096 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు సీఎం కేసీఆర్. 7 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ 628 డిశ్చార్జ్ కాగా ఇవాళ 43 మంది డిశ్చార్జ్ అయిన వారిలో ఉన్నారని చెప్పారు. 439 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రపంచదేశాలకు కరోనా పట్టిపీడిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసి కరోనాను కట్టడిచేశామని తెలిపారు.

కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం శ్రమించారని ..కరీంనగర్‌లో ఒక్క ప్రాణం పోకుండా చూశారని కొనియాడారు. తెలంగాణను చూసే మిగితా రాష్ట్రాలు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఫాలో అయ్యాయని చెప్పారు.

తెలంగాణలో కరోనా మరణాల శాతం 2.64గా ఉందన్నారు. సిలోమ్ వ్యాలీలో కరోనా వ్యాక్సిన్ సంబంధించి గుడ్ న్యూస్ అందించారని తెలిపారు. ఆగస్టులో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్ధ వెల్లడించిందన్నారు. తెలంగాణ నుండే కరోనా వ్యాక్సిన్ రావడం మనకు మంచి శుభపరిణామం అన్నారు.

- Advertisement -