‘ఆర్ఆర్ఆర్’.. ఆలియాపై రాజమౌళి కామెంట్స్..

274
SS Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గత కొంతకాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కరోనా కారణంగా తాత్కాలికంగా అగిపోయింది. అయితే సినిమాకు సంబంధించిన సమాచారం చిత్ర బృందం ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియపరుస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది.

Alia Bhatt

అయితే తన సినిమాలో సీత క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న ఆలియా భట్ గురించి చెబుతూ ట్వీట్ చేశారు రాజమౌళి. తాను తియ్యబోయే కథ ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాకపోయినప్పటికీ.. సీత క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నారు జక్కన్న. తారక్, చెర్రీల్లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలకు సరితూగేలా ఎమోషన్స్ పండించాల్సిన బలమైన క్యారెక్టర్ సీత అన్నారు. అమాయకురాలే అయినా స్థిర చిత్తం కలిగిన మహిళ సీత. అంత ప్రాముఖ్యత గల పాత్ర కనుకే.. దానికి ఆలియాభట్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. తన నమ్మకాన్ని నిలబెట్టే సత్తా ఆమెకుందన్నారు.