KCR:ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

23
- Advertisement -

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నల్గొండ సభలో మాట్లాడిన సీఎం…కార్యకర్తలు అధైర్య పడొద్దని బీఆర్ఎస్ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తుందన్నారు.

ఇది రాజకీయ పోరాటం కాదని..ఉద్యమ పోరాటం అన్నారు. ఒక్క పిలుపుతో పులులాగా క‌దిలివ‌చ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్ల‌కు ఉద్య‌మాభివ‌నంద‌నాలు చెప్పారు. నీళ్లు పంచ‌డానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్‌కు కానీ, కేంద్ర ప్ర‌భుత్వానికి గానీ, కేంద్ర నీటిపారుద‌ల మంత్రికి గానీ, మ‌న నీటిని దొబ్బి పోదామనుకునే స్వార్థ శ‌క్తుల‌కు గానీ ఒక హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌ అన్నారు.

ష్ణా న‌దిలో మ‌న జ‌లాలు, నీళ్ల మీద మ‌న హ‌క్కు అనేది మ‌నంద‌రి బ‌తుకుల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. చావో రేవో తేల్చే స‌మ‌స్య‌ అన్నారు. నీళ్లు లేక‌పోతే మ‌న‌కు బ‌తుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా స‌రిగా లేక‌పోతే బతుకులు వంగిపోయాయన్నారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఫ్లోరైడ్ ర‌హితంగా త‌యారు చేశాం అన్నారు. భ‌గీర‌థ నీళ్లు వ‌చ్చాక ఆ బాధ‌లు పోయాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని కేసీఆర్ తెలిపారు.

Also Read:KCR:నల్గొండ సభతోనే పోరాటం ఆగదు

- Advertisement -