దసరాకు మంత్రివర్గ విస్తరణ…!

630
cm kcr
- Advertisement -

మంత్రివర్గ విస్తరణపై మరోసారి వార్తలు వెలువడుతున్నాయి.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దసరాలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉంది. సామాజిక సమీకరణలు,గతంలో హామీ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

ఇందులో భాగంగా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గుత్తాతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మిగిలిన నాలుగు స్ధానాల్లో ఒక బీసీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీసీ కోటాలో కేబినెట్ బెర్త్ కోసం దానం నాగేందర్‌, బాజిరెడ్డి గోవర్దన్‌, వినయ్‌భాస్కర్‌, జోగు రామన్న, గంగుల కమలాకర్‌, నన్నపనేని నరేందర్‌లు పోటీలో ఉన్నారు.ఇక మహిళా కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌ లేదా ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌, సబితారెడ్డిల పేర్లు పరిశీలించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్‌ పేరు పరిశీలనలో ఉండగా గిరిజన కోటాలో రేగ కాంతారావు పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దసరాలోపు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -