జామకాయ ఉపయోగాలు తెలుసా?

546
- Advertisement -

జామపండ్లు ఆరోగ్యానికి అధిక లాభాన్ని చేకూరుస్తాయి. జామ ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదదం చేస్తాయి. జామకాయతో ఐస్‌క్రీమ్స్‌, సలాడ్స్‌ వంటివి తయారు చేసుకోవచ్చు. జామపళ్లలో సీ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. మన నుంచి అనారోగ్యాన్ని దూరం చేయడానికి జామకాయ ఎంతో మేలుచేస్తుంది.

విటమిన్‌ ‘సి’ ఎక్కువగా దొరికే వాటిలో ఉసిరికాయలకు దీటుగా జమా అని చెప్పుకోవచ్చు. నిమ్మ, నారిజల్లో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా విటమిన్లు జామలో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. జామ కాయ పండుతున్నకొద్దీ సి-విటమిన్‌ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు .. ఇందులో ఎ-విటమిన్‌, బి-విటమిన్‌, కాల్షియమ్‌, పాస్సరస్‌, పొటాషియమ్‌, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉంటాయి. అంతేకాదు, జీర్ణశక్తి పెంపొందించే పైబర్‌ జామలో నిండుగా ఉంటుంది.

జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బీ, సీ విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్‌ ఏ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇవి తినటం వల్ల గర్భిణుల్లో వ్యాధి నిరోదక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉండటంతో పాటు జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జామపండు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. బొప్పాయి, ఆపిల్‌, నేరేడు, పండుకంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది షుగర్‌ వ్యాధికి చక్కటి ఔషదం.

క్యాన్సర్‌ను తగ్గించేందుకు జామ శక్తివంతమైన యాంటీ ఆక్సీడెంట్‌గా ఉపయోగ పడుతుంది. ఇందులో ని యాంటీ ఆక్సీడెంట్లు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఊపిరి తిత్తులకు సబంధించిన వ్యాధులకు నివారిణిగా జామకాయ ఉపయోగ పడుతుంది.

జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల భారీనపడి ఆకలి మందగించిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. ఆకులను నమిలితే దంతాలు శభ్రపడతాయి. దృఢత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.

ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బడం, కడుపులో మంట నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి జామకాయలో విటమిన్‌ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రీషియన్‌ ఐ సైట్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జామకాయలోని కెరోటినాయిడ్స్‌, ఐసోఫానో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మెదడు కణాలు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతాయి.

 Also Read:Etela:ఈటెల జంప్..హింట్ ఇచ్చినట్లే?

- Advertisement -