ఎన్నికలకు ముందే.. టాస్క్ కంప్లీట్ ?

13
- Advertisement -

తెలంగాణలో గత కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పై సి‌ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారా ? లోక్ సభ ఎన్నికల కంటే ముందే పని పూర్తి చేయాలని భావిస్తున్నారా ? అంటే తాజా పరిణామాలు చేస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి టర్మ్ లో 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు సి‌ఎం రేవంత్ రెడ్డి. అయితే మరో ఆరుగురికి చోటు ఉండడంతో ఆ ఆరు పోస్టులను గత కొన్నాళ్లుగా పెండింగ్ లో పెడుతూ వచ్చారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఆరు మంత్రిపదవులకు పోటీ గట్టిగానే ఉంది. మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫ్రో. కోదండరాం.. ఇలా చాలమందే పోటీలో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనేది ఆసక్తి రేపుతున్న అంశం. ఈ నేపథ్యంలో తాజాగా సి‌ఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు.. కలిసి హటాత్తుగా ఢిల్లీ వెళ్లారు.

సడన్ గా వీరి డిల్లీ ప్రయాణం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పెండింగ్ లో ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పార్లమెంట్ స్థానాలకు కేటాయించాల్సిన సీట్ల విషయంలో అధిష్టానంతో చర్చించేందుకు డిల్లీ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పెండింగ్ లో ఉన్న మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే ఆలోచనలో సి‌ఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల వేళ మంత్రి పదవులపై కన్ఫ్యూజన్ ఏర్పడితే నేతల్లో అసహనం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఎలక్షన్ కంటే ముందే పూర్తి చేసి నయా జోష్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. పార్లమెంట్ సీట్ల కేటాయింపులో కూడా వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సి‌ఎం రేవంత్ రెడ్డి డిల్లీ ప్రయాణం ముగియగానే కాంగ్రెస్ నెక్స్ట్ ప్రణాళికలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:ముఖ్య గమనిక..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -