నిరీక్షణ ఫలించింది: పీవీ సింధు

555
pv sindhu
- Advertisement -

రెండు కాంస్యాలు, రెండు రజతాల తర్వాత స్వర్ణం సాధించాలన్న తన కల సాకారమైందని పీవీ సింధు తెలిపారు. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సింధుకు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌..సింధుకు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పగా అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీకి చేరుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సింధు…తన నెక్ట్స్‌ టార్గెట్‌ టోక్యోలో బంగారు పతకం సాధించడమే అన్నారు.

గతంలో ఎదురైన ఓటములపై సమీక్ష చేసుకున్నాను. నేను పసిడి గెలువాలని ఎంతో మం ది అభిమానులు కోరుకున్నారు. ప్రతిసారి ఒకే గేమ్‌ప్లాన్ పనిచేయదు. ఓడిపోయిన ప్రతిసారి మనల్ని మనం సమీక్ష చేసుకుని ముందుకు సాగాలి. ఫైనల్‌ను మిగతా మ్యాచ్‌ల్లాగే ఆడాలనుకున్నా. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగి అనుకున్నది సాధించానని తెలిపారు.

భవిష్యత్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తానని తన జర్నీలో మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలల పాటు కఠోరంగా శ్రమించాను. ఫిజియో సూచించిన పద్ధతులను పాటిస్తూ ఈస్థాయికి చేరుకున్నానని తెలిపింది సింధు.

- Advertisement -