ఆర్ఆర్‌ఆర్‌…సర్‌ప్రైజ్‌ ఎప్పుడో తెలుసా..?

600
rajamouli ntr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో తారక్‌ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేయనున్నారట. అక్టోబర్ 22న ఈ సర్‌ ప్రైజ్ ఉండబోతుందని సమాచారం.

2020 జులై 30న సినిమా విడుదల కానుంది. మూవీ విడుదలకు చాలా టైం ఉంది కాబట్టి కనీసం హీరోలకు సంబంధించి ఫస్ట్ లుక్‌ విడుదల చేస్తే మరింత అటెన్షన్‌ పెరుగుతుందని జక్కన్న భావిస్తున్నారట. దీంతో తారక్‌ లుక్‌ని రాజమౌళి ఏవిధంగా తీర్చిదిద్దారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఈ మూవీలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తుండగా తారక్ పాత్ర కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది.

- Advertisement -