‘తేజ్ ఐ లవ్ యు’ సెన్సార్ పూర్తి..

247
- Advertisement -

టాలీవుడ్‌ మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యు’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. క్రియేటివ్‌ కమర్షియల్‌‌ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మించారు. ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల భీమ‌వ‌రంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎలాంటి కత్తిరింపులు లేకుండా ‘యూ’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

Tej I Love U Movie

ఈ మూవీ గురించి సాయిధ‌ర‌మ్ మాట్లాడుతూ.. ‘తేజ్ ఐ ల‌వ్ యు’ స్వచ్ఛమైన ప్రేమకథ. కుటుంబ భావోద్వేగాలతో సినిమాలోని కొంత భాగం సాగుతుంది. చక్కటి చిత్రం‌, సరదాగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాను త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. నా ముగ్గురు మామయ్యల క‌ష్ట‌ం వల్లే ఇవాళ నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను. ‘తొలి ప్రేమ’ తీసిన దర్శకుడు 20 ఏళ్ల త‌ర్వాత నాతో ఈ సినిమా తీయ‌డం చాలా గొప్పగా ఉంది. నన్ను ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సినిమా ఈ నెల‌ 6న విడుద‌ల‌ కానుంది.

- Advertisement -