మంచి మనసు చాటుకున్న మెగా హీరో..

53
Hero Sai Dharam Tej

టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తన గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. ఇటీవ‌లే విజ‌యవాడ‌లోని ఓల్డ్ ఏజ్ హోం లోని వారికి నేనున్నానంటూ త‌న‌వంతు సాయ‌మందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆశ్రమం శిధిలావస్తకు చేరిందని.. ఆర్థిక సమస్యతో నిర్వాహకులు సతమతం అవుతున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ భవనంను పూర్తిగా బాగు చేయిస్తాను అని అలాగే అందులో ఉన్న వారి కోసం తాను అండగా నిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

అన్నట్లుగానే సాయి ధరమ్ తేజ్ భవనం నిర్మాణం పూర్తి చేయించాడు. గురువారం ఆ భవనంను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న వారిని కలిసి బాగోగులు తెలుసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా గొప్ప మ‌న‌సుతో త‌మ‌కు అండ‌గా నిలుస్తున్న సాయి ధ‌ర‌మ్ కు వృద్దులంతా ఘ‌న‌స్వాగ‌తం పలికారు. పేద‌ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ కు దీవెన‌లు అందించారు. ఈ సమయంలో అక్కడకు వెళ్లడం అంటే నిజంగా తేజూ మంచి మనసుకు హ్యాట్సాప్ అంటూ మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు.