భగవంత్ కేసరిలో శ్రీలల..

85
- Advertisement -

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’ టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ గత రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై శ్రీలీల తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. బ్లాక్ ఎథ్నిక్ వేర్ ధరించి, ప్లజంట్ గా కనిపిస్తుంది. సింపుల్ గర్ల్ గా నల్ల దారం, చెవిపోగులు ధరించింది.

Also Read:CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల.

Also Read:నిద్రలేమి సమస్య…అయితే ముప్పే!

- Advertisement -