ఆదికేశవ..’లీలమ్మో’ సాంగ్‌కు అదిరే రెస్పాన్స్

28
- Advertisement -

మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్‌ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది.

ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుంది. ‘లీలమ్మో’ నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. వైష్ణవ్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది. అంతా బాగుంటుంది ఈ పాట” అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రథమార్థం అంతా వైష్ణవ్ గారు, శ్రీలీల గారు, సుదర్శన్ గారితో ఎంతో సరదాగా సాగిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, సెకండాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమాఖచ్చితంగా అలరిస్తుంది” అన్నారు.’ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:అంతా అమర్ చుట్టే

శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ ప‌తాకాల‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో ఆదికేశవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అందం, అభినయం, నాట్యంతో తక్కువ సమయంలోనే యువత అభిమాన కథానాయికగా మారిన శ్రీలీల ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని మూడో పాట ‘లీలమ్మో’ అంటూ ఆమె పేరుతో సాగడం విశేషం. ఈ పాటతో పూర్తి మాస్ ట్రీట్ ఇవ్వాలని ఆదికేశవ టీమ్ నిర్ణయించింది.

డ్యాన్స్ మూవ్‌మెంట్‌లు, నాయకానాయికల జోష్ ‘లీలమ్మో’ పాటను మాస్ మెచ్చే పాటగా మలిచాయి. ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించేందుకు ‘ఆదికేశవ’ మరిన్ని అద్భుతమైన మాస్ మూమెంట్స్‌తో రాబోతోంది.జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘లీలమ్మో’ పాట అంతకుమించి ఉంది.

గీత రచయిత కాసర్ల శ్యామ్ తన మాస్ పదాలతో పాటను తప్పక వినేలా చేశారు. నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ అద్భుతమైన గాత్రంతో మాస్ లిరిక్స్‌కు ఎనర్జీని ఇచ్చారు. మాస్, ఎనర్జీ కలిసి ఈ పాటను మాస్ బ్లాస్ట్ గా మలిచాయి.పాటలు, ప్రోమోలు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు లీలమ్మో పాట ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఆదికేశవలో జోజు జార్జ్, అపర్ణా దాస్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేస్తున్నారు. ఆదికేశవ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:కలబందతో.. నిగారింపు సొంతం!

- Advertisement -