బన్నీతో శ్రీలీల చేస్తోంది ఏమిటి ?

52
- Advertisement -

పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీలీల బర్త్ డే నేడు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఆమె నటించిన ధమాకా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం 8 సినిమాలకు సైన్ చేసి మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే మ‌రోవైపు బ‌న్నీ, శ్రీలీల కాంబోతో త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 అంటూ ఆహా నానా హంగామా చేస్తోంది. అయితే బన్నీతో శ్రీలీల చేస్తోంది సినిమానా ? లేక యాడ్‌కి సంబంధించిన క్యాంపైనా ? లేక స్పెష‌ల్ సాంగా అనేది తెలియాల్సి ఉంది.

అటు శ్రీలీల, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. లంగాఓణీలో అచ్చు పల్లెటూరి అమ్మాయిలా శ్రీలీల పోస్టర్ తెగ ఆకట్టుకుంటుంది. శ్రీలీల ఈ సినిమానే కాకుండా బోయపాటి-రామ్‌ మూవీ, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. పైగా అన్నీ సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ చాలా కీలకం అని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలీల ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read:నిద్రలేమి సమస్య…అయితే ముప్పే!

ఐతే మరోవైపు ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమా చేస్తున్న బ‌న్నీ ఆ త‌ర్వాతి సినిమాను త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్నాడ‌ని తెలిసిన‌ప్ప‌టికీ దానికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ ఇంకా రాలేదు. కానీ ఈ సినిమాలో శ్రీలీల నే హీరోయిన్ అని తెలుస్తోంది. మొత్తమ్మీద శ్రీలీల ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

Also Read:CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన

- Advertisement -