టీడీపీ ఓటు బ్యాంక్.. ఎటువైపు?

74
- Advertisement -

తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎటువైపు వెళుతుందనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తరువాత తెలంగాణలో కూడా టీడీపీ తరచూ చర్చల్లో నిలుస్తోంది. తెలంగాణలో కూడా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం, ఇక్కడ కూడా చంద్రబాబుకు మద్దతుగా రాజకీయ నేతలు వ్యాఖ్యానించడం వంటి పరిణామాలతో టీడీపీకి సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అయితే మొదట తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సై అన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్ తరువాత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంది. దాంతో టీడీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకు ఎటువైపు మల్లుతుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నిస్తుంది. .

తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క వంటి కాంగ్రెస్ నేతలు టీడీపీ కండువాలు కప్పుకోవడం, టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం వంటివి చేస్తూ టీడీపీ సానుభూతి పరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలన్నీ కూడా ఎన్నికల కోసమే అనే గ్రహించిన టీడీపీ సానుభూతి పరులు కాంగ్రెస్ పట్ల కొంత దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. పైగా ఇటీవల టీడీపీ విషయంలోనూ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా టీడీపీ సానుభూతిపరులకు ఏమాత్రం నచ్చడం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీడీపీతో తనకు సంబంధం లేదని, చంద్రబాబు గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఓటర్లను కాంగ్రెస్ కు దూరం చేసే అవకాశం ఉందనేది కొందరు చెబుతున్న మాట. హుజూర్ నగర్, కోదాడ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం కాస్త గట్టిగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా కొంత బలంగా ఉండటంతో టీడీపీ ఓటు బ్యాంకు దూరమైతే కాంగ్రెస్ కు భారీగా గండి పడే అవకాశం ఉంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ గాలి బలంగా విస్తుండడంతో టీడీపీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వైపు మల్లె అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.

Also Read:CM KCR:జహీరాబాద్‌ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి

- Advertisement -