అవును వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఓ పెంపుడు కుక్క హనుమాన్ చాలీసాను పాడింది. పెంపుడు కుక్క రాగ్నార్ (Ragnar) బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, అతని యజమాని టెలివిజన్‌లో కొన్ని పాటలను ప్లే చేశారు. మొదట ఆ కుక్క పాటలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు, కానీ నుమాన్ చాలీసా భక్తిగీతం ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైంది.
మొదట షారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకి’ సినిమా నుంచి ‘లుట్ట్ పుట్ట్ గయా’ అనే పాటను ప్లే చేశాడు. తరువాత, కైలాష్ ఖేర్ ఆలపించిన ‘బమ్ లహిరి’ అనే శివుడి భక్తి గీతాన్ని ప్లే చేశాడు. ఈ రెండు పాటలు విన్నా రాగ్నార్ ఎలాంటి స్పందన చూపించలేదు. కానీ కొన్ని క్షణాల తరువాత హనుమాన్ చాలీసా పాటను ప్లే చేయగానే తల పైకెత్తి ఆలపించడం ప్రారంభించింది.
ఈ ఆసక్తికరమైన వీడియోను ‘Thebanjaaraboy’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయి ఇప్పటికే 11.4 మిలియన్ వ్యూస్ సాధించింది.
View this post on Instagram
Also Read:Gas Price:తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

