మయాన్మార్ భూకంపం..ఇస్రో ఉపగ్రహ చిత్రాలు!

17
- Advertisement -

భారీ భూకంపం కారణంగా మయన్మార్ దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడగా లక్షలాదిమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భూకంపం కారణంగా జరిగిన నష్టంపై ఉపగ్రహ చిత్రాలను రిలీజ్ చేసింది.

ఇస్రో విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో భూకంపం కారణంగా సంభవించిన భారీ నష్టం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రకృతి వైపరీత్యం ప్రధానంగా మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరం మండలేలో భారీగా నష్టం సంభవించింది.

భూకంపం అనంతరం కార్టోసాట్-3 ఉపగ్రహం అందించిన చిత్రాలు నష్టంపై కీలకమైన సమాచారం అందించాయి. విడుదల చేసిన చిత్రాలలో ఇరవాడీ నదిపై ఉన్న భారీ వంతెన కూలిపోయిన దృశ్యాలు ఉన్నాయి. అలాగే, మండలే విశ్వవిద్యాలయం కూడా దెబ్బతిన్నట్లు స్పష్టమైంది.

 

Also Read:Gas Price:తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఈ భూకంపం వల్ల అనేక ప్రాంతాలలో భారీ నష్టం జరిగింది. వేలాది మంది గాయపడగా, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారులు, నివాస భవనాలు, చారిత్రక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ సంక్షోభ సమయంలో భారతదేశం సహాయాన్ని అందించిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. భారత ప్రభుత్వ బృందాలు తక్షణమే మయన్మార్‌కు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

- Advertisement -