CM KCR:జహీరాబాద్‌ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి

38
- Advertisement -

దేశంలో రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు సీఎం కేసీఆర్. జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తేనే దానికి నిజమైన విలువ అన్నారు. మంచి వారికి ఓటు వేస్తే మంచి ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు హక్కు అన్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు అబద్దాలు..అసత్యాలు నోటికొచ్చిన హామీలిస్తారన్నారు. కానీ ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో పాటు ఆ అభ్యర్థి వెనకున్న పార్టీ చరితర తెలుసుకోవాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు.50 ఏళ్లు తెలంగాణను గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపి ఆనాడే ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా ఆలోచించాలన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదిస్తే తెలంగాణ వచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సంపద పెరిగిన కొద్ది పెన్షన్ పెంచుకుంటూ పోయామన్నారు. తెలంగాణ వచ్చాక వైద్య సదుపాయలు మెరుగుపర్చామన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలోచించి రైతు బంధు, రైతు భీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా చేస్తున్నారని మాట్లాడుతున్నారని…రైతు బంధు ఉండాలంటే మాణిక్ రావు గెలవాలన్నారు. 24 గంటల కరెంట్ రావాలంటే బీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రావాలన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని వారినే బంగాళాఖాతంలో వేయాలన్నారు. కాంగ్రెస్ తీసుకొస్తున్న భూమాత కాదు భూమేత అని మండిపడ్డారు. జహీరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు.

Also Read:హాట్ బ్యూటీ లేటెస్ట్ ముచ్చట్లు

- Advertisement -