పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా త్రివిక్రమ్‌తో తొలుత ఓ భారీ ప్రాజెక్టు చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల మధ్య ఇది నాలుగో మూవీ కాగా నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాయి సౌజన్యతో కలిసి అల్లు అర్జున్ సినిమా నిర్మిస్తున్న నాగ వంశీ, ఈ చిత్రం షూటింగ్ 2025 అక్టోబర్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు.
భారతీయ పురాణాల్లోని ఒక కల్పిత పాత్ర ఆధారంగా సాగనుందని, అల్లు అర్జున్ ఆ పాత్రను పోషించే అవకాశముందని వెల్లడించారు. 2026 సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
Also Read:మయాన్మార్ భూకంపం..ఇస్రో ఉపగ్రహ చిత్రాలు!

