లక్ష్మీ పార్వతి ఓకే.. మరి బాలకృష్ణ ఏమిటి?

42
- Advertisement -

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు నెల పై ఎప్పటికీ నిలిచిపోతారు. కానీ, ఆ ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు మాత్రం ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కి పదిమందికి పైగా వారసులు ఉన్నారు. కానీ, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప, మిగిలిన వారెవ్వరూ ఆయన పేరుకు తగ్గట్టు నడుచుకున్నవారు లేరు. తాజాగా నందమూరి చైతన్య కృష్ణ కూసిన కూతలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ పార్వతి తమ కుటుంబంలోకి వచ్చిన శని అని చైతన్య కృష్ణ అన్నారు.

దివంగత ఎన్టీఆర్ మనవడైన చైతన్య కృష్ణ హీరోగా చేస్తున్న ‘బ్రీత్ ‘ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య కృష్ణ, లక్ష్మీ పార్వతిపై స్పందిస్తూ.. ఆమె క్యారెక్టర్ లెస్ బిహేవ్ వల్ల తమ కుటుంబం చాలా నష్టపోయిందన్నారు.
సరే, లక్ష్మీ పార్వతి ఒక శని, క్యారెక్టర్ లెస్ అని అనుకుందాం. మరి చైతన్య కృష్ణ పరిస్థితి ఏమిటి ?, తన తాతగారి పేరు నిలబెట్టాడా ?, లేదు కదా. పైగా ఉన్న పేరును కూడా పోగొట్టెలా ఉన్నాడు. అయినా, క్యారెక్టర్ల గురించి చైతన్య కృష్ణ చాలా ఓపెన్ గా మాట్లాడినందుకు కచ్చితంగా మెచ్చుకుని తీరాలి.

కాకపోతే, ఇక్కడ మరో పాయింట్ విషయంలో కూడా చైతన్య కృష్ణ ఇలాగే రియాక్ట్ అవ్వాలి. నందమూరి బాలకృష్ణ పై హీరోయిన్ విచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తమిళ బిగ్ బాస్ వేదికగా విచిత్ర క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. 2001లో జరిగిన భలే వాడు బాసు సినిమా షూటింగ్ అనుభవాలను విచిత్ర బయటపెట్టింది. అడవిలో షూటింగ్ సమయంలో చెప్పుకోలేని చోట బాలయ్య తాకాడని విలపించింది. దీనిపై డైరెక్టర్ తో పాటు మరికొందరికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. క్యారెక్టర్ అంటే ఇదేనా చైతన్య కృష్ణ. బాలయ్య క్యారెక్టర్ లెస్ పై కూడా మాట్లాడు చైతన్య కృష్ణ.

ఇక చైతన్య కృష్ణ హీరోగా నటిస్తున్న `బ్రీత్` సినిమా విషయానికి వస్తే.. డిసెంబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. బసవతారకరామ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. వైద్య వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి నందమూరి జయకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రేక్షకులకు మాత్రం నమ్మకం కలగడం లేదు.

Also Read:Revanth:రేవంత్ రెడ్డిలో అంతర్మథనం!

- Advertisement -