జగన్ బుద్ధి మార్చాలి.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం..

185
- Advertisement -

అంబేడ్కర్ వంటి మహనీయులు వ్రాసిన రాజ్యాంగం లేకుంటే,జగన్ మోహన్ రెడ్డి వంటి పాలకుల పాలన ఇంకెంత భయంకరంగా ఉండేదో అలోంచించాలి అని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో నియోజక వర్గ టీడీపీ ఇంచార్జి వరుపుల రాజా అన్నారు. అంబేడ్కర్ 65వ వర్ధంతి పురస్కరించుకొని స్తానిక అంబేడ్కర్ కళా మందిర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజా ఘన నివాళులర్పించారు. జగన్ మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల గౌరవం కలిగేలా బుద్ధి మార్చాలని కోరుతూ టీడీపీ శ్రేణులు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం రాజా మాట్లడుతూ.. సృష్టిలో భగవంతుని తర్వాత అంత ఆదరణ పొందిన మహనీయులు అంబేడ్కర్ అన్నారు. అతని రాజ్యాంగము ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. అదే లేకుంటే నిరంకుశ పాలన చేస్తున్న నాయకుల దమనకాండ ప్రజలు మరింత ఇబ్బందులకు గురి అయ్యేవారు అన్నారు. గత ముఖ్యమంత్రులు పేదలకు నిర్మించిన ఇళ్లకు జగన్ మోహన్ రెడ్డి పది వేల రూపాయలు వసూలు చేయడం దారుణం అన్నారు. ఎవరూ పైసా కూడా చెల్లించ వద్దు అని అడిగితే ప్రతిఘటించాలని రాజా పీలుపు నిచ్చారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.

- Advertisement -