అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

34
minister srinivas goud

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. అర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పుష్పాంజలి ఘటించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట రావు, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తదితరులు పాల్గొన్నారు.