నాయకులు,కార్యకర్తలపై దాడులు.. టీడీపీ నిరసన..

40

కుప్పంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నిత్యం దాడులు చేస్తున్నారని కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్ పి.ఎస్‌ మునిరత్నం అన్నారు. మూడు రోజుల క్రితం టీడీపీ కార్యకర్త మురళిపై అత్యంత దారుణంగా కిడ్నప్ చేసి చిత్రహింసలుకు గురిచేసి కొట్టడం చంపేస్తామని బెదిరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. కుప్పంలో కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని టీడీపీ సానిభూతి పరులను టార్గెట్ చేసారని అన్నారు.

బయాందోళనలకు గురిచేయలని ప్రయత్నిస్తున్నారని ఇంకా సహించే ప్రసక్తే లేదని ఎదురుతిరిగే రోజులు వచ్చాయని అది ఈ ఘటనతోనే మొదయయిందని అన్నారు. మామీద దాడులు చేస్తే ఇంకా ఎదురుదాడి చేసేందుకు కూడా వెనుకడమని అన్నారు. పోలీసులు కనీసం చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని అన్నారు. దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేసేవరకు నిరసన విరమించమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులను అరెస్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ బాటిల్‌తో ఓ టిడిపి కార్యకర్త హల్చల్ చేశాడు.