రాహుల్‌ డైరెక్షన్‌లో నాని..!

311

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు.. తన కెరియర్‌లోనే ఈ పాత్ర ప్రత్యేకమైనదని ఆయన చెబుతున్నాడు. ఈ సినిమా తరువాత ‘టక్ జగదీశ్’ సెట్స్ పై వుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

Rahul-Sankrityan

ఈ సినిమాకి ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు. ‘టక్ జగదీశ్’ పూర్తికాగానే నాని ఈ కొత్త ప్రాజెక్టు పైకి వచ్చేస్తాడని అంటున్నారు. ఇందులో హీరోయిన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. ఈ సినిమను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించనున్నారు.