మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్!

281
pawan tana meeting

చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీ భారీ విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. తొలిరోజు పవన్ షూటింగ్ పాల్గోన్నారు. పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తుంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈమూవీతో పాటు పవన్ కళ్యాణ్ మరో రెండు మూవీలను లైన్ లో పెట్టారని తెలుస్తుంది. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో ఉండబోతుంది. జనవరి 27న ఈ చిత్రానికి ముహూర్తం పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఈచిత్రినికి ఏఎం రత్నం నిర్మించబోతున్నారని సమాచారం. ఎందుకంటే అజ్నాతవాసి షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నం దగ్గరి నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడని అందుకే ఆయన నిర్మాణంలో సినిమా చేస్తున్నాడని ఫిలిం వర్గాల సమాచారం.

pawan Kalyan New Movie Pink Photos

ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో పాటు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు పూరీని సంప్రదించి కథ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ పూర్తైన తర్వాత పవన్ కోసం కథను సిద్దం చేయనున్నాడని తెలుస్తుంది.