ప్రభాస్ కు తల్లిగా సీనియర్ హీరోయిన్

243
Prabhas Bhagyalakshmi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని జిల్ మూవీ దర్శకుడు కె.రాథాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా రోజుల క్రితం ఈమూవీ షూటింగ్ ప్రారంభమైన మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఇటివలే ప్రభాస్ ఈమూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు చిత్రయూనిట్. రొమాంటిక్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భాగ్య శ్రీ తెలుగులో బాలకృష్ణ రాణా సినిమాలో హీరోయిన్ గా చేసిన తరువాత టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత భాగ్యశ్రీ ప్రభాస్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈసినిమాను ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.