కంప్యూటర్‌ కొంటే ఉల్లిపాయలు ఉచితం..!

371

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు బగ్గుమంటున్నాయి. ఉల్లి కోసం సామాన్య ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర దాదాపు 200కు చేరువైంది. అయితే ఈ నేపథ్యంలో కొందరు ఉల్లి చోరీ చేస్తుంటే మరి కొందరు తమ వ్యాపారాలు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు. చోరీల మాట అటుంచితే.. కొందరు వ్యాపారులు తమ వద్ద సామాగ్రి తీసుకుంటే వారికి ఉల్లిపాయలు ఫ్రీ అని ఆఫర్స్‌ పెట్టి జనాలను ఆకర్షిస్తున్నారు. ఉల్లిపాయలతో ఆఫర్స్‌ ఏంటి అని షాకవ్వకండి.. తమిళనాడులో ఇలాంటిదే ఓ ఆఫర్ జనాలను ఆకర్షిస్తోంది.

computer

తమిళనాడులో ఒ కంప్యూటర్స్‌ షాప్‌ యజమాని ఒక కంప్యూటర్‌ కొంటే కేజీన్నర ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తానంటూ ఆఫర్‌ను ప్రకటించాడు. దానికోసం ప్రచారం కూడా చేస్తున్నాడు. పబ్లిసిటీ కొసం ఆ వ్యాపారస్తుడు తన షాపు వద్ద పెద్ద బోర్టు కూడా పెట్టించాడు. ఇక అంతే.. ఇది చూసిన జనాలు ఆ షాపు ముందు క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. మరి ఈ షాపు యజమానికి దీని వల్ల ఏమేరకు గిరాకీ పెరుగుతుందో చూడాలి.

Despite being a staple in most Indian dishes, onions have become unimaginably, exorbitantly expensive across the country..