ఉల్లిపై ఉచిత ఆఫర్స్..

334

దేశవ్యాప్తంగా ప్రజలకు ఉల్లి కష్టాలు మరో నెలపాటు తప్పేలా లేవు! కిలో రూ.200 వరకూ పలికిన నాణ్యమైన ఉల్లి ధర ప్రస్తుతం రూ.140కి తగ్గినా కొనుగోలుదారులు రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. అయితే ప్రజల కష్టలు అటుంచితే వ్యాపారులు మాత్రం వినూత్నంగా అలోస్తున్నారు. ఉల్లిపాయల ధరలు చుక్కలను అంటుతున్న వేళ, తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ దుస్తుల వ్యాపారి బంపరాఫర్ ను ప్రకటించాడు.

తన వద్ద రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. ఉల్లాస్ నగర్ లోని శీతల్ హ్యాండ్ లూమ్స్ యజమాని ఈ ఆఫర్ ను పెట్టాడు. “ఉల్లిపాయల ధర కిలోకు రూ. 140కి చేరుకుంది. ఇవాళ కూడా ధర పెరిగింది. దీంతో రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, ఉల్లిపాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఎంతో మంది ఈ ఆఫర్ ను ఇష్టపడుతున్నారు” అని షాపు యజమాని వ్యాఖ్యానించారు.