తమన్నా ఒక్క షోకు రూ.8లక్షలు

20
tamannha

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సనిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ , హిందీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. కాగా తమన్నా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఓ టాక్ షో చేయనుంది. త్వరలోనే ఈ షో ప్రారంభంకానుంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసీ ఉండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తమన్నా టాక్ షోకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.

ఈ టాక్ షోలో మొదటగా రామ్ చరణ్, అల్లు అర్జున్, రానాలు పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ షో గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో గోపిచంద్ తో సీటిమార్ సినిమాలో నటిస్తుంది. ఈసినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.