సాయిసుధ- శ్యామ్‌ కే నాయుడు కేసులో కొత్త మలుపు..

32
Actress Sai Sudha

టాలీవుడ్‌ నటి సాయిసుధ.. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సాయి సుధ చేసిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపిన పోలీసులు శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆయనకు బెయిల్ మంజూరైంది.

అయితే తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తాను, సాయిసుధ ఇద్దరం రాజీకొచ్చామంటూ బెయిల్‌కు శ్యామ్‌ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే, కోర్టుకు ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని కోర్టుకు సాయిసుధ తెలిపింది. దీంతో, ఆయన బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. అంతేకాదు, ఫోర్జరీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు.