బన్నీ, రానాలపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..

15
rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన తీసిన ప్రతీ సినిమా, చేసే ప్రతీ కామెంట్‌ సంచలనంగా మారుతోంది. తాజాగా వర్మ సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ టాప్ 10 స్టార్స్ లో సుశాంత్ ఒక్కడని… ఆయన మార్కెట్ వాల్యూ రూ. 75 కోట్లని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎవరు అణచివేస్తారని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులను నెటిజెన్లు విమర్శిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు.

బాలీవుడ్ లో ప్రతి యేటా దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయని… వాటిలో 10 సినిమాలను నియంత్రించడం దర్శకనిర్మాత కరణ్ జొహార్ వల్ల కాదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని… అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ విషయాన్ని బయటపెట్టారు.