అవును అతడితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నా:తమన్నా

39
- Advertisement -

ఎట్టకేలకు డేటింగ్ వార్తలపై స్పందించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. విజయ్ వర్మతో రిలేషన్ షిప్ పై మాట్లాడారు. సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉందని తెలిపింది.

నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నాపట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం అని తెలిపింది. లస్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైనట్లు వెల్లడించింది.

Also Read:Whatsapp:స్క్రీన్ షేరింగ్ ఫీచర్

వాస్తవానికి గతకొన్ని రోజులుగా తమన్నా – విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి బయటతిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే న్యూఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది.

Also Read:ప్రతిరోజూ పరిగెత్తితే.. ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -