ప్రజలకు మరింత చేరువలో విజయ డెయిరీ: తలసాని

177
talasani srinivas

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో బ్యాటరీతో నడిచే 15 వాహనాలను పంపిణీ చేశారు మంత్రి తలసాని.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…విజయ బ్రాండ్ ఉత్పత్తుల కు విశేష ప్రజాదరణ ఉందన్నారు. విజయ డెయిరీ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని వెల్లడించారు.

ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని ఔట్ లెట్ ల ఏర్పాటు చేస్తున్నాం అని…ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామన్నారు తలసాని. నగరంలో 100 బ్యాటరీతో నడిచే మొబైల్ ఔట్ లెట్ ల ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని దేశంలోనే విజయ డెయిరీ అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు.