పౌల్ట్రి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం: తలసాని

460
talasani
- Advertisement -

పౌల్ట్రీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా 13వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు తలసాని. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుండగా ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మనుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తోంది.

గత 13 ఏళ్లుగా ఎక్స్ పో నిర్వహిస్తున్న IPEMA ప్రతినిధులకు ధన్యవాదా తెలిపారు మంత్రి తలసాని. పౌల్ట్రీ రైతులకి పవర్ సబ్సిడీ తో పాటు ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లోను సహకారం అందిస్తోందన్నారు. పౌల్ట్రీ రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సబ్ కమిటీ ని ఏర్పాటు చేశారని చెప్పారు.

పౌల్ట్రీ రైతుల సమస్యలపై డిసెంబర్ 2న సబ్ కమిటీతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారని… పౌల్ట్రీ పరిశ్రమలో మన రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగులున్నారని చెప్పారు.పౌల్ట్రీ రైతులకు ఉన్న వాటర్ సమస్యని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం అన్నారు.

Minister Talasani Srinivas Inaugurated Poultry India Exhibition At HICC hyderabad..Minister Talasani Srinivas Inaugurated Poultry India Exhibition At HICC hyderabad

- Advertisement -