సంపూ కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!

628
sampoornesh babu
- Advertisement -

హీరో సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న సంపూ కారును సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనగా ఈ ఘటనలో సంపూతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

సంపూకు పెను ప్రమాదం తప్పడంతో కుటుంబసభ్యులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు. కామెడీ పేరడి చిత్రాలతో కడుపుబ్బా నవ్వించే సంపూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇటీవల కొబ్బరి మట్ట చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. మంచు ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే సంపూ…తన కొత్తచిత్రానికి రెడీ అవుతున్నాడు.

TSRTC bus has hit actor Sampurnesh Babus car. Sampurnesh and his family members were in the car while the accident took place. Sampu is out of danger it is reported.

- Advertisement -