ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్..

67
Suresh Raina

టీమిండియా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ముంబయి ఎయిర్ పోర్టు సమీపంలోని ‘డ్రాగన్ ఫ్లై పబ్’ను నిర్వాహకులు తెరిచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పబ్ పై దాడులు చేసిన ముంబయి పోలీసులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న సురేష్ రైనా, గాయకుడు గురు రణధావా సహా 34 మందిని అరెస్ట్ చేశారు.

ఐపీసీ సెక్షన్లు 188,269,34 కింద రైనా, తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సహర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ ఆఫీసర్ ధృవీకరించారు. తర్వాత వారిని బెయిల్‌పై మీద విడుదల చేసినట్లు వివరించారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు ఆ క్లబ్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

కాగా, అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ అర్ధాంగి సుజానే ఖాన్ కూడా ఉన్నారు. నిర్దేశించిన సమయం మించి పబ్ తెరిచి ఉంచారని, ఇతరత్రా నియమాల ఉల్లంఘన కూడా జరిగిందని అరెస్ట్ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. బ్రిటన్ లో కరోనా కొత్తరకం వెలుగు చూసిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.