రైతుల అధ్యాయన కేంద్రాలుగా రైతువేదికలు: మంత్రి

63
Minister Koppula Eshwar

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషిచేయడంతో పాటు క్లస్టర్‌లో రైతులు ఏ పంటలను సాగు చేయాలి, పంటను సాగు చేయడం ద్వారా కలిగే లాభనష్టాలు, మార్కెట్ సౌకర్యాలు వంటి భవిష్యత్ నిర్ణయాలకు అధ్యాయన కేంద్రాలుగా రైతు వేదికలు నిలుస్తాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోరుట్ల నియోజక వర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలలో (మోహన్ రావుపేట, పైడి మడుగు, ఐలాపూర్ గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభోత్స మరియు నాగులపేట, మాదాపూర్, సర్పరజపల్లి, కల్లూరు, వెంపేట, చిట్టాపూర్, ముత్యంపేట గ్రామాల్లో చెక్ డ్యాంల శంకుస్థాపన) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ. ఏక్కడ రైతులు అభివృద్ధి చెందుతారో, ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుందని విశ్వసించి, మొట్టమొదటిసారి వ్యవసాయాభివృద్దికి కొంగోత్త అలోచనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అభివర్ణించారు. రైతులు ఎల్లప్పుడూ బాగుండాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సరికొత్త ఆలోచన విధానంతో, రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో 71 క్లస్టర్లను గుర్తించడంతో పాటు, ప్రతి పరిదిలోని క్లస్టర్‌లో ఐదు వేల ఎకరాలకు ఒక రైతువేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. రైతులు అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం అందజేసే సహాయం, ఒక క్లస్టర్‌లో సాగు చేసే పంటలు, వాటికి ఉన్న డిమాండ్, గిట్టుబాటు ధర, పంట నష్టం,విత్తనాలు, ఎరువులు, ఇతర వివిధ అంశాల మీద చర్చించుకోవడానికి అధ్యాయన కేంద్రాలుగా రూపాంతరం చేంది, రైతుల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో ముఖ్య భూమికను పోషిస్తాయని అన్నారు. రైతువేదికల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేలా ఆయా గ్రామ సర్పంచులు ప్రత్యేక చోరవ చూపి నిర్మాణాలును వేగవంతంగా పూర్తిచేసారని తెలుపుతూ వారిని అభినందించారు.

ఇబ్బడి ముబ్బడిగా ఒక్కదాన్యాన్ని మాత్రమే సాగుచేసే విధానం కొనుసాగుతుందని, తద్వార ఎదురయ్యే సమస్యలపై రైతువేదికల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు ఇతర పంటలను కూడా సాగుచేసేలా అవగాహనను కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. బయటి ప్రాంతాల నుండి ఇతర పంటలను దిగుమతి చేసుకున్నప్పటికి, ప్రస్తుతం చేపలను మాత్రం దిగుమతి చేసుకోలేకపోతున్నామని, తెలంగాణలో చేపట్టిన ప్రాజేక్టుల నిర్మాణాల ద్వారా, రాష్ట్రంలో మత్స రంగాన్నీ ప్రోత్సహించడంతో పాటు తెలంగాణను ఫిష్ హబ్ గా మార్చుకోవడం జరిగిందనేది అతిశయోక్తి కాదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అవసరానికి మించి దొడ్డు వడ్లను సాగు చేయడం ద్వారా వాటి మార్కేటింగ్ కొరకు విపరితమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా రైతులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కోన్నారు. 1888 రూపాయలు వడ్లకు ధరనిర్ణయించడంతో పాటు 50వేల కోట్లరూపాయలను రైతులకు అందించేలా ప్రభుత్వమే పూచికత్తు ఉండి నిర్ణయించిన ధరను రైతులకు అందజేసేలా చర్యలుచేపట్పిందని పేర్కోన్నారు.

అనంతరం చనిపోయిన రైతులకు రైతు భీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కులను పలువురు రైతు కుటుంబాలకు మంత్రి అందజేశారు. అనంతరం కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో 214 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణా పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 90 కోట్ల నిధులతో 35 చెక్ డ్యాంలను మంజూరు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. గోదావరి ద్వారా నీరు వృదాగా సముద్రంలో కలిసిపోకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో 23 బారి ప్రాజేక్టులను పూర్తిచేసుకొని, కోటి మూపై లక్షల ఎకరాలలో పంటను పండించే స్థాయికి మన రాష్ట్రం అభివృద్ది చెందిందని అన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే అంచనాలకు మించి దాన్యం సాగుచేయడం జరిగిందని పేర్కోన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహయం అందని వారు లేరు అనేరీతిలో ప్రతివర్గం, రైతులు, గ్రామా, పట్టాణ, వ్యవస్థల అభివృద్దికి దాదాపు 400 స్కీంలను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కోన్నారు.

ఐలాపూర్ గ్రామంలో రైతువేధికను ప్రారంభించారు. దేశంలో గాని రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతువేధికల గురించిన ఆలోచన కూడా లేదని అన్నారు. వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం ప్రయోగాత్మక రాష్ట్రంగా రూపాంతరం చెంది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశానికి అన్నం పేట్టే రైతుల ఇబ్బందులను దూరంచేసి, ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో విద్యూత్, సాగునీరు, పంటసమయంలో రైతులు అప్పుల పాలు కాకుండా ఎకరానికి 5 వేల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 15వేల కోట్ల భీమా ప్రభుత్వమే రైతుల పేరున చెల్లిస్తుందని, రైతులు చనిపోయినట్లయితే వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే మంచిఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే రైతుభీమా కార్యక్రమాన్ని అమలు చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. లోవోల్టేజి సమస్యతో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక పోలం దగ్గరె కాపాలా పడుకున్న రోజులు, రాత్రి సమయాల్లో పోలానికి నీళ్లుపెట్టడానికి వెల్లి విద్యూత్ షాక్ తో, పాముకాటు రైతులు బలికాకుండా ఉండాలనే అనేక అభివృద్దికార్యక్రమాలను ప్రవేశపెట్టుకోవడం జరిగిందని అన్నారు.

యూరియా ఎక్కడ ఎంత కావాలో ముందుగానే సమకూర్చుకొని రైతులకు అందించడం జరుగుతుందని, కల్తి విత్తనాలు సమూలంగా నిర్మూలించడానికి పీడి యాక్ట్ ను ప్రవేశపెట్టి వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి మహప్రాజేక్టు నిర్మాణం ద్వారా సగం తెలంగాణను సస్యశ్యామలంగా మార్చుకోవడం జరిగిందని. అదేవిధంగా మరో 23 బారి ప్రాజేక్టుల నిర్మాణాలతో ప్లోరైడ్ సమస్యలతో బాధపడె జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు సాగు, త్రాగు నీటిని అందించడం జరిగుతుందని పేర్కోన్నారు. ఎండకాలంలో ఎదురయ్యే నీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపేవిధంగా 60 కోట్లతో మీషన్ భగీరథ లాంటి మహత్తర కార్యాక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కోన్నారు. ఒక్కటని కాకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సంక్షేమం, పట్టణి కరణ, ఐటి, పరిశ్రమలు వంటి ప్రతి రంగంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలతో తెలింగాణ ఆదర్శంగా నిలవడం మాత్రమే కాదు, దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి కొప్పుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, కోరుట్ల నియోజవర్గ శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, జట్పిటిసి లావణ్య రాజేష్,ఎంపిపి తోట నారయణ, జిల్లా రైతుసమన్వయ సమితి కన్వీనర్ వెంకటరావు పాల్గొన్నారు.