రామ్ చరణ్‌తో రష్మిక రొమాన్స్‌..!

179
Rashmika Mandanna

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ కి జోడీ పాత్ర కూడా ఉంటుందట. అయితే, ఆ పాత్రలో నటించేది ఎవరన్న విషయం గత కొన్ని రోజులుగా సస్పెన్సుగా సాగుతోంది.

బాలీవుడ్ హీరోయిన్‌ కియరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన కథానాయికగా నటిస్తుందంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, తాజాగా రష్మిక పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. మరి, రష్మిక ఎంపిక పూర్తయిందా? లేక కియరానే నటిస్తుందా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు..